నవతెలంగాణ – నసురుల్లాబాద్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి నసురుల్లాబాద్ కమ్మ సంఘం తరఫున కమ్మ సంఘం అధ్యక్షులు శివప్రసాద్ ఉపాధ్యక్షులు చౌదరి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. బాన్సువాడ నుంచి కోటగిరి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వెళుతూ మార్గమధ్యలో ఉన్న నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల విన్నపం మేరకు గ్రామంలో మంత్రి కాన్వాయి అపి నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కమ్మ సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందు పటేల్, యూసుఫ్, భాస్కర్ రెడ్డి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.