లైబ్రరీలో మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి

నవతెలంగాణ-సూర్యాపేట
ఇచ్చిన మాట ప్రకారం జిల్లా గ్రంథాలయ అవరణలో యువతీ,యువకుల కోసం విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి భోజనవసతి ఏర్పాటు చేశారు. శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో భోజన సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధానంగా రెండు రోజుల కింద మంత్రి గ్రంథాలయాన్ని సందర్శించిన విషయం తెల్సిందే. కాగా ప్రస్తుతం కాంపిటీటివ్‌ పరీక్షల సీజన్‌ నడుస్తుండడంతో జిల్లాకేంద్రంలో ఉన్న గ్రంథాలయం యువతీ, యువకులతో ప్రతినిత్యం కిక్కిరిసిపోతుంది.ఈ క్రమంలో అన్ని వసతులు బాగానే ఉన్న పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి మధ్యాహ్న భోజనం ఆటంకంగా మారింది. కొంతమంది భోజనం కోసం ఇంటికి వెళ్ళితే సమయం వృథా అవుతుండగా, మరి కొంతమందికి చాలా దూరం ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక మహిళల ఇబ్బందులు వర్ణాతీతంగా మారింది.మరి కొంతమందికి ఆర్థికసమస్యలు కూడా ఉన్న విషయాన్ని ఆకస్మిక తనిఖీలో మంత్రి గ్రహించారు. వారు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకొని తన ఔదార్యాన్ని చాటారు. అదేవిధంగా అక్కడి యువతీ, యువకులు అదనపు నిర్మాణం అవసరాన్ని మంత్రి దష్టికి తీసుకొచ్చారు.వెంటనే స్పందించిన మంత్రి యుద్ధప్రతిపాదికన ప్రతిపాదనలు సిద్ధం చేసి హామీ ఇచ్చిన రెండు రోజులకే లైబ్రరీలో అదనపుసీటింగ్‌ కోసం కావాల్సిన షెడ్‌ నిర్మాణం కోసం జిల్లా గ్రంథాలయ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. మూడు రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి తమపై చూపిన ప్రేమాభిమనాలకు యువత ఫిదా అయ్యి కండ్లలో ఉన్న తమ ఇబ్బంది ని గుర్తించి మాట మీద నిలబడి సమస్యలను పరిష్క రించిన నాయకుడు జగదీశ్‌రెడ్డి అని కొని యాడారు. ఈకార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌చైర్మెన్‌ పుట్టా కిషోర్‌,బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తాహేర్‌పాషా, నిమ్మల స్రవంతి, రాపర్తి శ్రీనివాస్‌, అనంతుల యాదగిరి, ఎల్గూరి రమాకిరణ్‌గౌడ్‌, రఫీ, శ్రీనివాస్‌ యాదవ్‌, సల్మా,కరుణశ్రీ, అంజమ్మ, దండు రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Spread the love