రోడ్డు ప్రమాదం..మంత్రికి గాయాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక మంత్రి హెబ్బాల్కర్ లక్ష్మి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బెళగావి జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. కుక్క రోడ్డును దాటుతుండగా దాన్ని తప్పించేందుకు టర్న్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు ముందరి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంత్రి ముఖం, నడుముకు స్వల్ప గాయాలయ్యాయి.

Spread the love