ఫిట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

నవతెలంగాణ – హైదరాబాద్: ఫిట్స్ వచ్చిన ఓ వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడి తన మంచితనాన్ని చాటుకున్నారు. రాయికోల్ టోల్ గేట్ వద్ద ఓ వ్యక్తికి సడెన్‌గా ఫిట్స్ వచ్చింది. దీంతో అతను వ్యక్తి కింద పడిపోయాడు. అదేసమయంలో కొల్లాపూర్‌కు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యక్తి పడి పోయి ఉండటాన్ని గమనించి వెంటనే తన వాహనాలను ఆపారు. కారులో నుంచి దిగి తన అనుచరులతో సదరు వ్యక్తిని కాపాడారు. అంబులెన్స్‌కు స్వయంగా ఫోన్ చేసి బాధితుడిని ఆస్పత్రికి పంపించారు. బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Spread the love