మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ కూడా వెళ్లాలి: మంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ‘ఛలో మేడిగడ్డ’ పర్యటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని… కానీ అక్కడకు కేసీఆర్ కూడా వెళ్లాలని వ్యాఖ్యానించారు. బుధవారం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీగా అవినీతి చేసిన బీఆర్ఎస్ నేతలు గతంలో ప్రభుత్వం తీసుకు పోయినప్పుడు రాకుండా ఇప్పుడు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. అయినప్పటికీ వారి పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వారి తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తుకు తెస్తోందన్నారు. మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ కూడా వెళ్లి… కూలినందుకు ఆనకట్ట సాక్షిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దని నిపుణుల కమిటీ సూచించినప్పటికీ అక్కడే నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని కాగ్ ఎండగట్టిందన్నారు.

Spread the love