నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, వైస్ ఛైర్మెన్ పరమేష్ పటేల్ , అలాగే జుక్కల్ నియోజకవర్గ నాయకులతో రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు అభినందిస్తూ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్యకు వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ కు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.