నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హైదరాబాద్ లోని వారి నివాసంలో బుధవారం భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎంపీ గా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీలకతీతంగా అందరి సహకారంతో ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తనమీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తుకు ఓటు వేసి, భువనగిరి ఎంపీగా గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.