నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లా కేంద్రంలోని మహిళ కళాశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు నల్లగొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్, ఇతర గదుల నిర్మాణానికి కు శంకుస్థాపన చేస్తారు. 1: 30 గంటలకు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ సిస్టం ను ప్రారంభిస్తారు.