నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ – నిజామాబాద్‌
నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీనితో పాటు న్యాక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్‌ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారంతా ఐటీ శాఖతో ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్‌ ఆధ్వర్యంలో జూలై 21న నిర్వహించింది. వేలాది మంది తరలిరాగా అందులో నైపుణ్యం కలిగిన వారిని ఐటీ కంపెనీలు రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ఆకట్టుకునే రీతిలో చేపట్టారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్‌ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరించాలనుకున్న సమయంలో ఎలాంటి స్థలాల కొరత లేకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు.

Spread the love