మైక్రోచిప్ టెక్నాల‌జీ సెంట‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మైక్రోచిప్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌

నవతెలంగాణ హైదరాబాద్‌: కోకాపేట‌లో మైక్రోచిప్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాస్కామ్ ప్ర‌కారం గ‌త రెండేళ్ల‌లో టెక్నాల‌జీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైద‌రాబాద్‌లోనే సృష్టించిన‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికి లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉందని  కేటీఆర్ వెల్లడించారు.

Spread the love