– అంతర్జాతీయ ఐటీ దిగ్గజసంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన యువనేత
– తెలంగాణ భవిష్యత్ నేతగా ఎన్నో విజయాలు.. మరెన్నో ప్రశంసలు : కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్
– కేటీఆర్‌కు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పాటల సీడీ ఆవిష్కరణ
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘దేశంలోనే నెంబర్ నేతగా, యువతకు రోల్‌మోడల్‌గా ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే.తారకరామావు నిలిచారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. తెలంగాణ ఐటీ సిగలో యువతకు ఉపాధి గనిని సృష్టించారు. తెలంగాణ ప్యూచర్‌లీడర్‌గా ఎన్నో విజయాలు, ప్రశంసలు అందుకుంటున్నారు.’ అని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. నేడు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఆయన విజయాలు, ప్రగతిపై ప్రత్యేకంగా రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొద్దుల లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణను మంత్రి కేటీఆర్ అగ్రగామిగా నిలిపారన్నారు. దేశవిదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేలా ప్రోత్సహించారని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు, ఐటీ కంపెనీల స్థాపనకు సులభతరమైన అనుమతులు ఇస్తూ రాష్ట్ర యువతకు ఉపాధిని చూపారన్నారని అభినందించారు. ప్రపంచంలో అతిపెద్ద సంస్థలైన అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి అంతర్జాతీయ కంపెనీల ప్రపంచస్థాయి రెండో బ్రాంచ్‌లను ఇక్కడికి తీసుకొచ్చి యువనాయకుడిగా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నారని తెలిపారు. ఇండ్రస్టీయల్ ఫ్రెండ్లీ వాతావరణంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపుతున్న మంత్రి కేటీఆర్ నిండునూరెేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ అమీర్ పాల్గొన్నారు.