మంత్రి కేటీఆర్ కు అస్వస్థత…

నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అయితే జిల్లా కేంద్రానికి చేరుకోగానే ఒంట్లో నలతగా ఉందని గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయారు. గెస్ట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు, అధికారులు ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎవరు ఆందోళన చెందవద్దని పార్టీ నేతలు తెలిపారు.

Spread the love