కొత్తకోటలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

KTRనవతెలంగాణ – వనపర్తి: వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పాలిటెక్నిక్‌ కాలేజీలో నిర్వహించనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంటకేశ్వర్‌ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు. మధ్యాహ్నం బుగ్గపల్లితండా వద్ద రూ.425కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా వనపర్తి నియెజకవర్గం రాజాపేట వద్ద 96 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారు. సురవరం కళాభవన్‌ పేరుతో నిర్మించిన భవనాన్ని, సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ను కూడా ప్రారంభించనున్నారు.

Spread the love