నేడు ఇందూరులో ఐటీ టవర్‌ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ – నిజామాబాద్‌: నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ బుధవారం ప్రారంభంకానున్నది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కే తారాకరామారావు దీనిని ప్రారంభించనున్నారు. దీనితోపాటు న్యాక్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. కేటీఆర్‌ రాక సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Spread the love