నేడు ఉప్పల్‌ స్కైవాక్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్: ఉప్పల్ చౌరస్తాలో నిర్మించిన స్కైవాక్​ను నేడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉప్పల్ లో  ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగటం ఊర్ల నుంచి బస్సులు తిరగడం ప్రయాణికుల రద్ధీ అధికంగా ఉండడంతో ప్రయాణికులకు రోడ్డు దాటడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో స్కైవాక్ కును నిర్మించింది. 660 మీటర్ల మేర ఏర్పాటుచేస్తున్న ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం కోసం హెచ్​ఎండీఏ రూ.25 కోట్లు ఖర్చుచేసింది. ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతోపాటు మెట్రోస్టేషన్‌తో ఆ వంతెనని అనుసంధానించారు. నాలుగు వైపులనుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా దారులు ఏర్పాటు చేశారు.మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, గర్భిణులు.. స్కైవాక్‌కి చేరుకునేందుకు అత్యాధునిక ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి సౌకర్యాలు కల్పించారు. స్కైవాక్ మొత్తంపొడవు 640 మీటర్లు, వెడల్పు 3-4 మీటర్లు కాగా 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేశారు.

Spread the love