నవతెలంగాణ – కామారెడ్డి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జీవధాన్ స్కూల్ ప్రాంగణంలో 35 వేల మందితో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి రానుండటంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్, జాజాల సురేందర్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.