నవతెలంగాణ – హైదరాబాద్: చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు. మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా సాయిని భరత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ప్రారంభిస్తారు. పోచంపల్లిలోని ప్రధాన రహదారిపై పోలీస్‌స్టేషన్ వద్ద పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతోపాటు సమీకృత వెజ్, నాన్ వెజ్ మారెట్, ధోబీ ఘాట్, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం చేనేత వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించనున్నారు.