రేపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

నవతెలంగాణ – హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ మంగళవారం (జూన్,20) సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మన ఊరి-మన బడి లో భాగంగా నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కంప్యూటర్ చాంప్స్’ కార్యక్రమం ప్రారభోత్సవం. (జిల్లాలో 60 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య) అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వికలాంగులకు (దాదాపు 1000 మందికి) సహాయాలు మరియు ఉపకరణాల పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు వాలీబాల్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు కేటీఆర్.

Spread the love