నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్టు అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన లాంటి వారు యుగానికొక్కరు పుడతారని గుర్తు చేశారు. శనివారం చెన్నైలోని తారామణిలో భారత హరితవిప్లవ పితామహుడు, సుప్రసిద్ద వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలలో మంత్రితోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సీడ్స్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించి లక్షలాది మంది చనిపోయిన పరిస్థితిని చూసి చలించి వైద్యవిద్యను వదిలేసి వ్యవసాయ విద్యను ఎంచుకుని పరిశోధకుడిగా మారిపోయారని గుర్తు చేశారు.