సీఎం రేవంత్ ను మారుస్తారనే ప్రచారంపై స్పందించిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti responded to the campaign of changing CM Revanthనవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. త్వరలో సీఎంను మారుస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డిని మార్చబోరని వెల్లడించారు. తమ ప్రభుత్వం మరో నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుందన్నారు. ఈ టర్మ్ రేవంత్ రెడ్డి పూర్తికాలం సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఒకవేళ తమ పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే టీ కప్పులో తుపానులా సమసిపోతాయన్నారు

Spread the love