ధరణి’ పోర్టల్‌ ప్రక్షాళన దిశగా చర్యలు : మంత్రి పొంగులేటి

నవతెలంగాణ – హైదరాబాద్‌: గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూసమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికే ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి, భూ వ్యవహరాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరమేర్పడిందన్నారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టామని తెలిపారు.

Spread the love