బీజేపీ మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు: మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది..

– కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చింది..
– సామాజిక న్యాయం చేస్తుంది.. 
– పేపర్ 1 లో పాస్ అయ్యాం గెలిచాం.. పేపర్ -2 లో గెలవాలి..
నవతెలంగాణ – వేములవాడ 
బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తె అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారు..శ్రీ రాముడిని హిందువులం అంత పూజిస్తాం..రాముడి నీ పూజిద్దాం బీజేపీ నీ తొక్కుదాం..రాముడిని పూజిద్దాం బండి సంజయ్ నీ తొక్కుదాం.. నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్, ఆది ,కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర్ గార్డెన్ లో వేములవాడ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాలా రాజేందర్ రావు..ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ,ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , పిసిసి అధికార ప్రతినిధి డా,, రియాజ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ రివ్యూ సమావేశంలో దమ్మున్నోడు కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండాలి అనుకున్నోడు వారి పోలింగ్ బూత్ లలో మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు. పేపర్ 1 లో పాస్ అయ్యాం గెలిచాం.. పేపర్ -2 లో గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త దీక్షతో పనిచేసే గెలిపించుకొని పార్లమెంటుకు రాజేందర్రావును పంపాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి, కేంద్రంలో  మరోసారి బిజెపి ప్రభుత్వం వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తారని అన్నారు.
ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..
13 వ తేదిన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి వెలి చాల రాజేందర్ రావు ని అత్యధిక మెజారిటీ తో గేలిపించడానికి వేములవాడ నాయకత్వం తీవ్రంగా కృషి చేయాలిఅని పిలుపునిచ్చారు.వేములవాడ నియోజకవర్గంలో బలంగా ఉన్నామనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకొని ఈనెల 8న   మోడీ నీ వేములవాడ కి తీసుకొస్తున్నారు. బీజేపీ మళ్ళీ అదికారంలోకి వస్తె ఎస్సి, ఎస్టీ, బీసీ ల రిజర్వేషన్లు తొలగిస్తారు అన్న విషయాన్ని   ప్రజల్లోకి తీసుకుపోవలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మహిళలకు , నిరుద్యోగులకు ఏటా లక్ష రూపాయల సహాయం చేస్తారని తెలిపారు.
వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ..
డోర్ టూ డోర్ ప్రతి గడప తాకి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాంచ్ న్యాయ్  ప్రజల్లోకి తీసుకెళ్ళాలి,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె ఏం చేస్తామని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. బీజేపీ నీ బొంద పెట్టడానికి ఉన్న అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి,రిజర్వేషన్లు ఎత్తివేస్తమని  అమిత్షా ,సంజయ్   చెప్పడం జరిగింది అని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తె అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారు..శ్రీ రాముడిని హిందువులం అంత పూజిస్తాం.రాముడి నీ పూజిద్దాం బీజేపీ నీ తొక్కుదాం..రాముడిని పూజిద్దాం బండి సంజయ్ నీ తొక్కుదాం.. నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోదం అని కార్యకర్తలకు సూచించారు.కాంగ్రెస్ మేనిఫెస్టో లో మహిళలకు లక్ష రూపాయలు సంవత్సరానికి.. నిరుద్యోగులకు లక్ష ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పెట్రోల్ 65 చేస్తామని చెప్పారు.. జీఎస్టీ తగ్గిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగం కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, రజాక్, పుల్కం రాజు, సంఘ స్వామి యాదవ్, తూమ్ మధు, తోటలహరి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love