నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు (30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్లు) అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సంస్థ ఎండీ సజ్జనార్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. సీసీఎస్ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్టు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్టు వివరించారు.