దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, లను ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు వేద పారాయణ మండపంలో మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీకి వేదమంత్రాలతొ ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని, స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి సత్కరించారు. వారి వెంట వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.