నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహాత్మా జ్యోతిబాఫులే గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ లో పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన తర్వాతే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఫులే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంపై మాట్లాడేటప్పుడు అక్కడి పరిధులు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పారు.