నవతెలంగాణ – హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వాహనదారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం పంపారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందామని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మద్యం తాగి వాహనం నడపొద్దు. అది ప్రమాదానికి సూచిక అంటు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.