అభివద్ధి పనుల్లో వేగం పెంచాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నవతెలంగాణ – మీర్‌ పేట్‌
మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో చేపట్టిన వివిధ అభివద్ధి పనుల్లో వేగం పెంచాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లోని 31, 32, 36వ డివిజన్లలో జరుగుతున్న ఎస్‌ఎన్డీపీ పనులను బుధవారం మేయర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురికితో కలుషితం అవుతున్న చెరువులను కబ్జాకు గురికాకుండా వాటిని సుందరీకరణ చేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం రాకముందే చెరువుల సుందరీకరణ పనులు, ఎస్‌ఎన్డీపీ నాలా పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు లోపించకూడదని హెచ్చరించారు. మంత్రాల చెరువు పక్కన వీది వ్యాపారుల కోసం నిర్మాణం చేస్తున్న షెడ్డును తొందరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 31వ డివిజన్‌లో అంతర్గత రోడ్ల (సీసీి,బీటీ) నిర్మాణానికి రూ 1.50లక్షలు మంజూరు చేసినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్థానిక కార్పొరేటర్‌ విజయ లక్ష్మీ రాజ్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్‌ పేట్‌ మేయర్‌ దుర్గా దీప్‌ లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌ రెడ్డి, ప్లోర్‌ లీడర్‌ అర్కల భూపాల్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య, మున్సిపల్‌ కమిషనర్‌ నాగేశ్వర్‌, డీఈ గోపీనాథ్‌, కార్పొరేటర్లు విజయ లక్ష్మీ రాజ్‌ కుమార్‌, వేముల నర్సింహా, కో అప్షన్‌ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love