మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ పై మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలనీ బాలాజీ నగర్ సర్పంచ్ భర్త ఇస్లావత్ వినోద్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రహ్లద్ ఏనాడు టికెట్ కావాలి అని అడగలేదు అని అంటున్న మంత్రి సత్యవతి రాథోడ్ కి మరి అదే లబండి సామాజిక వర్గం నుండి టికెట్ ఆశించిన వారు ఎవరు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఈనెల 16/09/2023 రోజున ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సత్వవతి రాథోడ్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ డా” అజ్మీరా ప్రహ్లద్ పై చేసిన వాక్యాలు సరైనవి కాదు రెండు సార్లు మంత్రి ని కలిసి టికెట్ విషయం మాట్లాడుతే నా చేతిలో ఎం ఉంది అని సంధానం చిన్న మంత్రి నేడు ప్రహ్లాదు టికెట్ అడగలేదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.2018 లో మంత్రి చందూలాల్ ఓటమి తరువాత బి ఆర్ ఎస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగా చందూలాల్ గారి కుటుంబాన్ని పక్కన పెట్టడం వాస్తవం కాదా అన్నారు.ములుగు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టింది ఈరోజు పార్టీ ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం చందూలాల్ నాయకత్వమే నని గుర్తించుకోవాలి.లంబడిలా పై అంత ప్రేమ ఉంటే ప్రహ్లద్ ని కాదన్నపుడు ఉద్యమ నాయకుడు పోరిక గోవింద్ నాయక్ కి, మరియు ఎప్పటి నుండో టికెట్ ఆశిస్తున్నా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కి ఎందుకు టికెట్ ఇవ్వలేదో లంబాడ కులానికి సమాధానం చెప్పాలన్నారు. నిరంతరం కెసిఆర్ భజన చేసే మంత్రి సత్యవతి మొన్నటికి మొన్న గిరిజన లంబడి మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ మహిళను నానా ఇబ్బందులు పెడితే కనీసం ఆ విషయం పై స్పందించకుండ కనీసం ఆ బాధితురాలిని పరమర్శించకుండా ఈ రోజు నా లబండి సోదరులు అని సంభోదించడం సిగ్గుచేటు అన్నారు.ఈ రోజు మంత్రి గా ఉన్నాను అనే గర్వతో మాట్లాడుతున్న సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి చందూలాల్ మంత్రిగా ఉన్నపుడు తన స్థాయి ఏంటో గుర్తుకు చేసుకోవాలి. ములుగు నియోజకవర్గంలోనీ లంబాడిలపై అంత ప్రేమే ఉంటే మాజీ మంత్రి చందూలాల్ ములుగు లో గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చారు. దాన్ని మీరు మీకున్న మంత్రి పదవినీ అడ్డు పెట్టుకొని మీ సొంత గుడికి తీసుకు పోవడం జరగలేదా దీన్ని చూసి ములుగు నియోజకవర్గం లో లంబాడి సోదరులకు మీరు ఇంతగా కపట ప్రేమ చూపిస్తున్నారో వాళ్లకు తెలుస్తుందన్నారు. తన సొంత సామాజిక వర్గానికి ద్రోహం చేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ నిన్ను లంబడిలు క్షమించరు, రాబోయే ఎన్నికలలో నీ తల గర్వం దింపుతారు లంబడిలా సత్తా ఏమిటో చూపిస్తా రాన్నరు.