నవతెలంగాణ – హైదరాబాద్: గ్లోబల్ లాజిక్ సాఫ్ట్‌వేర్ నూతన కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ..ఏఐ రంగానికి పెద్దపీట వేస్తున్నామని, మరో నాలుగైదు నెలల్లో పీపీపీ విధానంలో ఏఐ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. ‘‘అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం కావలసిన సహకారం అందిస్తుంది. బహుళజాతి కంపెనీలే కాకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 12 శాతానికి చేరాయి. వచ్చే ఐదేళ్లలో 20శాతానికి ఐటీ ఎగుమతులను పెంచేలా ప్రణాళిక రూపొందించాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తున్నాం. మలేసియాలోని తెలుగువాళ్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.