గత మూడు రోజులుగా ఏడా తెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మరియు మంథని నియోజకవర్గ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా బుద్ది5 మాట్లాడారు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు వరద నీటి ప్రవాహాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలను అందించాలని జిల్లా కలెక్టర్లను, జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న సందర్భంగా పట్టణ ప్రజలు, మారుమూల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా శిథిలావస్థలో ఉండి కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు చెరువుల నీరు చేరే అవకాశం ఉన్న లోతట్టు గ్రామాల ప్రాంత ప్రజలను గుర్తించి వారిని సురక్షిత ప్రదేశాలకు అధికారులు వెంటనే తరలించాలని, ప్రజలకు ఇలాంటి ముప్పు రాకుండా వారికి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలతో మంచి సౌకర్యాలు కల్పించాలని కోరారు.చెరువులు, కాలువలు, కుంటల వద్ద ఏలాంటి ప్రమాదాలు జరగకుండా నీటి ప్రవాహం ఉన్నచోట రాకపోకలపై దృష్టి సాధించాలని తెలియజేశారు.
ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నచోట జాగ్రత్త వహించాలని, ఐరన్ విద్యుత్ స్తంభాలు ఉన్నచోట విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగిన సూచనలు అందించాలని కోరారు.గోదావరినది పరివాహక ప్రాంతాల్లో, కాలువలు చెరువుల ప్రాంతాల్లో పశువులను, మేకలను మేపడానికి మరియు చేపలు వేటకు గాని ఎవరు వెళ్ళవద్దని కోరారు.ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించ గలరు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి,గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి. ఈ వర్షాలకు కల్వర్టు, చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయవద్దని కోరారు.గోదావరి నది , వాగుల పరివాహ గ్రామ ప్రజలు, పిల్లలు, యువకులు నది దగ్గరకు సెల్ఫీలు తీయడానికి ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు పూర్తి దృష్టి సారించాలని కోరారు.