మంథని పట్టణంలోని గోదావరిఖని రోడ్డు మార్గంలో గల గీట్లస్ హబ్ వద్ద నేడు శనివారం హైదరాబాద్ వారి సెంటిలియాన్ నెట్ వర్క్స్ ప్రైవేటు లిమిటెడ్ నూతన సాఫ్ట్ వేర్ కంపెనీ బ్రాంచ్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంథని నియోజకవర్గంలోని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొననున్నారు. మంథని నడిబొడ్డున సాప్ట్ వేర్ కంపెనీ పెట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.