బాధిత కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరమార్శ

– మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు
నవతెలంగాణ మల్హర్ రావు: ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో గాయాలపాలైన మంథని నియోజకవర్గంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన గుర్రం సతీష్ ను హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు  పరామర్శించారు. తీవ్ర గాయాలపాలైన గుర్రం సతీష్ ను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్ లో  చేర్పించిన విషయం తెలుసుకున్న  రాష్ట్ర పరిశ్రమల, ఐటి, శాసనసభా వ్యవహరాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు నిమ్స్ కు చేరుకొని అతడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.  అదేవిధంగా మంథని నియోవర్గానికి చెందిన పలువురిని బుధవారం మంత్రి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అదించాలని వైద్యులను ఆదేశించారు.

Spread the love