బండి పుల్లారావును పరామర్శించిన మంత్రి తుమ్మల

నవతెలంగాణ – అశ్వారావుపేట
సీనియర్ నాయకులు,అశ్వారావుపేట మండలంలో తన ప్రధాన అనుచరుడు, నారంవారిగూడెం గ్రామానికి చెందిన బండి పుల్లారావు ను మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ‘పుల్లారావు’ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ప్రజా జీవితంలోకి రావాలని సూచించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది అంజనేయ స్వామి,పశ్చిమ గోదావరి జిల్లా విజయ రాయ్ రాట్నాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఆయన వెంట అలపాటి రామచంద్రప్రసాద్, దొడ్డా ప్రసాద్,ఎల్లిన రాఘవరావు,మున్నా రత్నాకర్,రసూల్,డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Spread the love