గుబ్బల మంగమ్మ దేవాలయం సందర్శించిన మంత్రి తుమ్మల

– ఓ ప్రైవేట్ కార్యక్రమం విందుకు హాజరు..
– ఓ అభిమాని ఇంట్లో తేనీటి సేవనం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం మండలంలోని గుబ్బల మంగమ్మ దేవాలయం సందర్శించారు. దైవ సన్నిధిలో అనుచరులు,అభిమానులతో కొద్ది సమయం గడిపారు. అనంతరం గోగులపుడి సమీపంలో ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమంలో విందులో పాల్గొని అభిమానులు,అనుచరులు తో భోజనం చేసారు. తిరుగు ప్రయాణంలో కన్నాయిగూడెం లోగా తన రాజకీయ ప్రారంభం కాలం అభిమాని, అనుచరుడు చిలుకూరి సత్యనారాయణ గృహం లో ఆయన ను పరామర్శించి, తేనీటి సేవనం చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మల పుల్లారావు,బండి పుల్లారావు,బండి భాస్కర్,మొగళ్ళపు చెన్నకేశవ రావు,ఆలపాటి రామచంద్ర ప్రసాద్,సుంకవల్లి వీరభద్రరావు, యర్రా వసంత రావు,దొడ్డా ప్రసాద్,కేదాసి వెంకట సత్యనారాయణ,అచ్యుత రావు,సత్యవరుపు బాలగంగాధర్,గార్లపాటి రాములు,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Spread the love