నవతెలంగాణ – హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15న CM రేవంత్ ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. భద్రాద్రి(D) దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 15న ప్రారంభం కానుండటంతో ఈ నెల 11న మంత్రి సమక్షంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.