మేడిగడ్డ బ్యారేజీపై సత్వర విచారణ జరగాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

minister uttam kumar reddyనవతెలంగాణ-హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీపై సత్వర విచారణ జరగాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వెంటనే విచారణ జరగాలన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీగా తప్పులు చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులకు సంబంధించి కమీషన్ల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టిందని మండిపడ్డారు. ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నాటి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని నివేదికలను ఇవ్వలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించిందన్నారు. విజిలెన్స్ నివేదికపై న్యాయ సలహాలు తీసుకొని కేసును నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Spread the love