నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంట సాగు నీటి కోసం నీటి విడుదల చేయ్యడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టుకు రానున్నారు. ఉదయం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి ఉదయం 10 గంటల వరకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు నుండి నీటిని వదిలిన అనంతరం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుకోనున్నారు.