కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..

నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. లోక్ సభఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను వేగంగా చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటికే ప్రజా పాలన పేరుతో లబ్దిదారులనుంచి దరఖాస్తులు సేకరించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతో కొద్దిరోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ నెరవేరనుంది.

Spread the love