నిజామాబాద్ నూతన మున్సిపల్ కమిషనర్ కు మంత్రి వేముల శుభాకాంక్షలు

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ మకరంద్ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా నిజామాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్ మకరందకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా సంబంధిత అధికారులతో సహకారం తీసుకొని నిజాంబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
Spread the love