మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మకు నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. భౌతిక కాయం స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు తరలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేములకు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Spread the love