అఫ్గానిస్థాన్‌లో స్వల్ప భూకంపం..

నవతెలంగాణ – కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్ పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 12.03 గంటలకు భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం కాబూల్‌కు పశ్చిమాన ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 73 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Spread the love