రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు మిర్దాపల్లి విద్యార్థులు ఎంపిక

నవతెలంగాణ- ఆర్మూర్
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు మండలంలోని  మిర్తాపల్లి జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జూనియర్ సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేష్ గురువారం తెలిపారు. ఈనెల 8వ తేదీ శుక్రవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లాల బాల బాలికల సబ్ జూనియర్ హాకీ సెలక్షన్ రిశ్వంత్  అనే విద్యార్థి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది ఈ విద్యార్థి  ఈనెల డిసెంబర్ 16 నుండి కామారెడ్డి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటున్నట్టు తెలిపారు. 13వ తేదీన ఆర్మూర్ మినీ స్టేడియంలో ఉమ్మడి జిల్లాల అండర్ 17 ఇయర్స్ జూనియర్ బాల బాలికల విభాగంలో జరిగిన హాకీ సెలక్షన్స్ లో  ప్రవీణ్* అనే విద్యార్థి రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగింది ఈ యొక్క విద్యార్థి ఈనెల డిసెంబర్ 17 తేదీ నుండి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాబడ్డ విద్యార్థులకు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంట శ్రీనివాస్ రెడ్డి  అభినందనలు తెలుపుతూ రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ  కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.  విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు.

Spread the love