ఇంట్లో కూతురు మిస్సింగ్.. పక్కింటి మహిళ తన తమ్ముడితో అదే పనిగా ఫోన్‌కాల్స్..

నవతెలంగాణ – ఉత్తర ప్రదేశ్:  బండా నగరంలో  ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. అతనికి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుమార్తె ఉంది. రాత్రి  కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా కలసి భోజనం చేశారు.తర్వా ఎవరి గదులకు వారు వెళ్లి పడుకున్నారు. తెల్లవారుజామున బాత్రుమ్ కు వెళ్లేందుకు నిద్రలేచిన తండ్రికి కూతురి గది తలుపులు తెరిచి ఉండటం కనిపించింది. కూతురు ఏం చేస్తోందోనని అతను గదిలోకి వెళ్లి చూడగా కూతురు కనిపించలేదు. ఇల్లంతా వెతికినా ఆమె ఇంట్లో లేదు. దీంతో ఊరంతా గాలించారు. కానీ ఆమె కనిపించలేదు. అదే సమయంలో అతనికి పొరుగింటి మీద అనుమానం వచ్చింది. తన కూతురు ఎక్కుగా పొరుగింటికి వెళుతుండేదని గుర్తుకొచ్చి చారు ఆ ఇంటికి వెళ్లాడు. పొరుగింట్లో ఉండే మహిళ తన తమ్ముడితో ఫోన్ మాట్లాడుతూ.. అతన్ని చూడగానే ఫోన్ పెట్టేసింది. ఇదే విధంగా పలుమార్లు జరగడంతో ఆ తండ్రి ఆ మహిళను, ఆమె భర్తను నిలదీశాడు. పొరుగింట్లో ఉండే మహిళకు ఒక అన్న ఉన్నాడు. అతను తరచుగా చెల్లెలి ఇంటికి వచ్చినప్పుడు అతనితో డిగ్రీ చదువుతున్న అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.  ఆమె భర్త ప్రణాళిక ప్రకారంగా ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తమ అన్నతో ఆ అమ్మాయిని పూణేకి పంపించేశారని కూడా తెలిసింది. ఈ విషయాలు తెలిశాక ఆ అమ్మాయి తండ్రి కోపంతో రగిలిపోయాడు. పొరుగింటి వారితో తన కూతురుని వెనక్కు పిలిపించమని చెప్పినా వారు స్పందించలేదు. దీంతో వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ భార్యాభర్తల పై కేసు నమోదు చేసి ఆ అమ్మాయి కోసం దర్యాప్తు ప్రారంభించారు.
Spread the love