– నవతెలంగాణ పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డి పేట గ్రామానికి చెందిన రఘు ఈ నెల 10న హైదరాబాదులో చికిత్స పొందుతున్న వాళ్ళ బాబాయ్ ని కుటుంబీకులతో కలిసి చూసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో తప్పిపోయాడు. దీంతో యువకుడు అదృశ్యం అనే వార్తను నవతెలంగాణ పత్రిక సోమవారం ప్రచురించింది. ఈ విషయాన్ని కుటుంబీకులు సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్టులు చేశారు. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ నర్సాపూర్ లో పనిచేయడంతో ఆయన అక్కడి సోషల్ మీడియా గ్రూపులో ఫార్వర్డ్ చేశాడు. నర్సాపూర్ ఏరియాలో ఉన్నట్లు సాఫ్ట్వేర్ సమాచారం ఇవ్వడంతో యువకుడి తల్లిదండ్రులు బంధువులు వెళ్లి తీసుకొచ్చారు. రఘు ఆచూకీ లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నవతెలంగాణ పత్రిక ఎంతో దోహదపడిందని, పత్రికలో ప్రచురించిన విషయం ద్వారానే తమ కుమారుడి ఆచూకీ తెలిసిందని ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.