నీరుగారుతున్న మిషన్‌ భగీరథ

– బేగంపేటలో ప్రమాదకరంగా ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌
– ఇనుప చువ్వలు తేలి శిథిలావస్థలో..
– కన్నెత్తి చూడని మిషన్‌ భగీరథ అధికారులు
– త్వరితగతిన చర్యలు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి
గత ముప్పై ఎండ్ల క్రితం నిర్మించిన ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మిషన్‌ భగీరథ పథకంలో పురాతన ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌కు రంగులు వేయడంతో నూతనంగా కనిపించింది. ఇంతవరకు బాగానే ఉన్న పురాతన ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ పై బాగంలో పగుళ్లు ఏర్పడి గత ఏడాదిగా ఎళ్లప్పుడూ నీరుగారుతోంది.దీంతో వాటర్‌ ట్యాంక్‌ ఇనుప చువ్వలు దర్శనమిస్తూ ప్రమాదకరంగా మారిందని..ఎప్పుడూ ఏ ప్రమాదం సంభవిస్తుంతో తెలియని దుస్థితి నెలకొందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.వాటర్‌ ట్యాంక్‌ ప్రమాదకర స్థాయిలో ఉన్న మిషన్‌ భగీరథ అధికారులు కన్నెత్తిచూడడం లేదని..దీంతో ప్రభుత్వ మిషన్‌ భగీరథ లక్ష్యం నీరుగారుతోందని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత మిషన్‌ భగీరథ అధికారులు త్వరితగతిన స్పందించి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన వాటర్‌ ట్యాంక్‌ పై తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పంచాయతీ కొనుగోలు చేసిన భూమి కబ్జా?
సర్పంచ్‌ బాపు రెడ్డి హయాంలో ఓవర్‌ వాటర్‌ ట్యాంక్‌ ల నిర్మాణం కోసం స్థానికుడు టప్ప రాంరెడ్డి దగ్గర సుమారు 0.07 గుంటల భూమిని గ్రామ పంచాయతీ కొనుగోలు చేసిందని..గ్రామంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు, అధికారుల అలసత్వం వల్ల నేడు 0.05 గుంటల భూమిని ఇతరులు కబ్జా చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.వాటర్‌ ట్యాంక్‌ల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిని అక్రమించిన వారిపై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కబ్జా గురైన భూమిని స్వాదీనం చేసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Spread the love