తెల్ల రాళ్లపల్లి తండాలో మిషన్‌ భగీరథ వాటర్‌ బందు

– పట్టించుకొని పాలకులు
నవతెలంగాణ- పాన్‌గల్‌
రాష్ట్ర ప్రభుత్వం త్రాగే నీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ నీటి సరఫరా సరిగా కావడం లేదని తెల్ల రాళ్లపల్లి తాండ ప్రజలు తెలిపారు. ప్రతినెల ఆరు ఏడు రోజులు నీటి బందు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవౌతున్నారు. పానగల్‌ మండలం తెల్ల రాళ్లపల్లి తాండ లో నాలుగు రోజుల నుండి మిషన్‌ భగీరథ నీటి బంద్‌ కావడంతో తాండవ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్‌ శాంతమ్మ ఎన్నోసార్లు అధికారులకు దృష్టి తీసుకు వెళ్లిన ప్రయోజనం లేదన్నారు. ఆ గ్రామంలో ఐదు సంవత్సరాల కిందట మిషన్‌ భగీరథ కొత్త ట్యాంక్‌ నిర్మాణం చేయడం జరిగింది. వాటర్‌ వాటర్‌ ట్యాంక్‌ లో నేటికీ వరకు కూడా నీటి సరఫరా చేయలేదన్నారు. నీటి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్‌ మిషన్‌ భగీరథ జిల్లా అధికారులకు కొల్లాపూర్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ పది సార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఇప్పుడు అప్పుడు కాలయాపన చేస్తున్నారు తప్ప మంచినీటి సరుపర చేయడం లేదని వారు విమర్శించారు. మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ లోఈనెల 30వ తేదీ వరకు మంచినీటిసమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్‌ నిరాహార దీక్ష చేపడతామని వారి హెచ్చరించారు.

Spread the love