నవతెలంగాణ -హైదరాబాద్ : ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బోల్తాపడింది. తుదిపోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఎంతో అద్భుత విజయంతో గెలుపొందిన ఈ ట్రోఫీని ఆస్ట్రేలియా క్రికెటర్లు అవమానించారు. ఈ ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ ఈ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోని చూసిన నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘మార్ష్ నీకిది తగునా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ‘దయచేసి ఈ ట్రోఫికి కాస్త మర్యాద ఇవ్వండి’ అని కామెంట్ చేశారు. ఇక మరొక నెటిజన్ ‘ఆస్ట్రేలియన్లకు ఇది ఏమంత సిగ్గుచేటు కాదు’ అని వ్యాఖ్యానించారు.