కార్వాన్ నుండి మిత్ర కృష్ణ.. 

నవతెలంగాణ – ధూల్ పేట్ 
కార్వాన్ నియోజక వర్గం నుండి బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జియాగుడ మాజీ కార్పొరేటర్ ఏ మిత్ర కృష్ణ ఎంపికయ్యారు. దీంతో నియోజక వర్గంలోని డివిజన్ల బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేసి, స్వీట్లు తినిపిస్తూ సంబురాలు చేశారు. గతంలో కాంగ్రెస్ నుండి జీయాగుడ డివిజన్ కార్పొరేటర్ గా చేసిన ఆయన టీఅర్ఎస్ వచ్చాక అదే డివిజన్ నుండి టీఅర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా విజయం సాధించారు. గత ఎన్నకలో మళ్ళీ టీఅర్ఎస్ నుండి కార్పొరేటర్ గా బీజేపీతో ఓటమి అయ్యారు. డివిజన్ తో పాటు నియోజక వర్గంలోని కార్వాన, గుడిమల్క పుర, లంగర్ హౌస్, నానల్ నగర్ వంటి అన్ని డివిజన్ ల నాయకుల, ప్రజలతో సుపరిచితుడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. స్థానికంగా ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు చేశారు..
Spread the love