జాతీయ మినీ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు మిట్టపల్లి క్రీడాకారులు..

నవతెలంగాణ డిచ్ పల్లి : గత నెల ఆర్మూర్ లో జరిగిన మినీ సబ్ జూనియర్ (అండర్ -11) బాలుర విభాగంలో  తెలంగాణ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలలో డిచ్ పల్లి మండలం లోని మిట్టపల్లి పాఠశాలకు చెందిన క్రీడాకారులు కే కిషోర్, ఈ శ్రీశాంత్ లు పాల్గొని ప్రతిభ కనబరిచి మొదట గా రాష్ట్ర ప్రబబుల్స్ జట్టుకు ఎంపికై గత నెల 29 నుండి ఈ నెల మూడు వరకు శిక్షణ శిబిరంలో పాల్గొని అత్యున్నత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికై ఈనెల 6 నుండి 8 వరకు ఆర్ టి డి స్టేడియం అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్గొంటున్నట్లు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సత్య ప్రకాష్ సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా  సర్పంచ్ తేలు గణేష్ మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామం నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.ఈ సందర్భంగా ఎంపికైన కిషోర్,  శ్రీశాంత్ లను సర్పంచ్ తేలు గణేష్, ఎంపిటిసి బాలగంగాధర్, ఉప సర్పంచ్ కిషన్, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ మాసిపెద్ది శ్రీనివాస్, గ్రామ పెద్దలు గోపు రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి గంగా మోహన్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజేత, ఉపాధ్యాయులు బాల్ రాజ్ ,శ్రీకాంత్, మమత, రమాదేవి లు అభినందించారు.
Spread the love