ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం.. ఎమ్మెల్యే బీగాల 

నవతెలంగాణ- కంటేశ్వర్:

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 48 & 25వ డివిజన్ లలోని పాటి గల్లీ, జెండా గల్లీ, కోటగల్లీ, గోల్ హనుమాన్ కాలనీ లలో బుధవారం ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ రాష్ట్రం లో ప్రతి పల్లెప్రతి పట్టణం లో శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. నిజామాబాద్ నగరం లో అభివృద్ధి చేయని గల్లీ లేదు, సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మినీ ట్యాంక్ బండ్, అధునిక సదుపాయాలతో నిర్మించిన వైకుంఠదామలు నిజామాబాద్ ప్రగతికి నిదర్శనమన్నారు. యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ కొరకు న్యాక్ భవనం నిర్మించామన్నారు. ఐటీ టవర్ నిర్మించి 400 మందికి స్థానికులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రగతి కి మారు పేరు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయండి, మరింత అభివృద్ధికి సహకరించలాని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్, గజ్జెటి వెంకట నర్సయ్య, యెనుగందుల మురళి, 48వ డివిజన్ నాయకులు సత్యపాల్, పుండ్ర నరేష్ రెడ్డి, రేసు హన్మాండ్లు, పబ్బా సాయి ప్రసాద్ 25వ డివిజన్ కార్పొరేటర్ సిరిగాధ ధర్మపురి, కో అప్షన్ సభ్యులు అంతరెడ్డి లత దేవేందర్, చింతకాయల రాజు, పుప్పాల రవి, కస్తూరి గంగరాజు, శివ ప్రసాద్, పాలకొండ నర్సింగ్ రావు, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love